![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu )'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-445లో.. ప్రేమకోసం ధీరజ్ జ్యూస్ చేసుకొని తీసుకొస్తాడు. ఇక ప్రేమ పాట పడగానే కాకి గొంతులా ఉందని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత జ్యూస్ తాగి బాలేదని ప్రేమ అంటుంది. ఇక ధీరజ్ ని ఏడిపించడానికి కాఫీ తీసుకురమ్మని చెప్తుంది. అది తీసుకొచ్చాక.. నాకు వద్దని ప్రేమ అంటుంది. ఇక విసిగిపోయిన ధీరజ్ ఫ్రస్టేషన్ తో ప్రేమని కొట్టబోతుంటే అప్పుడే చందు వస్తాడు. ఏంట్రా ఎందుకు అలా చేయి చేసుకోబోతున్నావని ధీరజ్ ని చందు అడుగుతాడు.
టార్చర్ చూపెడుతుందని చెప్తాడు ధీరజ్. తనకి యాక్సిడెంట్ అయింది.. తన పనులు చేసుకోలేదు కదా అని చందు అంటాడు. నిన్ను కాపాడింది అనే ఒకే ఒక్క కారణంతో దానికి సేవలు చేస్తున్నాను అంతే తప్ప అమూల్య విషయంలో ఇది చేసిన ద్రోహానికి లైఫ్ లో ఎప్పుడూ దీనిని క్షమించనని ప్రేమ గురించి ధీరజ్ మాట్లాడతాడు. అప్పుడే అక్కడికి అమూల్య, నర్మద వస్తారు. రేయ్ నోర్ ముయ్ రా నీ భార్య గురించి ఇంకొక్క విషయం తప్పుగా మాట్లాడితే చంపేస్తానని చందు కోప్పడతాడు. నేను మాట్లాడిన ప్రతీ మాట నిజమే కదా అన్నయ్య అని ధీరజ్ అంటాడు. అసలు విశ్వని అమూల్య ప్రేమించమని చెప్పింది ప్రేమ అని నీకెవరు చెప్పారు.. నువ్వు చూశావా అని నిలదీస్తాడు.. ముమ్మాటికి ప్రేమనే ఇలా చేసిందని ధీరజ్ అంటాడు. విశ్వని అమూల్య ప్రేమింంచేలా చేసింది ప్రేమ కాదు వల్లి అని చందు చెప్పగానే ధీరజ్ తో పాటు అమూల్య, నర్మద, ప్రేమ షాక్ అవుతారు. ఇక అమూల్యని నిజం చెప్పమని చందు అంటాడు. దాంతో వల్లి వదిన అదంతా చేసిందని అమూల్య చెప్తుంది. విన్నావ్ గా.. అసలు మన కుటుంబం ఇలా కావడానికి కారణం వల్లి.. అందుకే వాళ్ళ అమ్మకి బాలేదని చెప్పి వల్లిని వాళ్ళ పుట్టింట్లో వదిలేసి వచ్చానని చందు అంటాడు. తను మోసం చేసిందని చందు ఎమోష్ అవుతుంటే ధీరజ్ వచ్చి హగ్ చేసుకుంటాడు.
వల్లి గురించి నాన్నకి తెలిస్తే తట్టుకోలేడని ఎవరికి చెప్పలేదురా ప్రేమ.. ఎన్నో అవమానాలని భరించిందిరా మన కుటుంబం బాగుండటం కోసం.. నీ భార్యని తప్పుగా అర్థం చేసుకోకురా తను చాలా మంచిది అని ధీరజ్ తో చందు అంటాడు. ఇక ధీరజ్ జరిగినవన్నీ గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతాడు. మరోవైపు సాగర్ కి జీతం వస్తుంది. ఆ డబ్బులతో అందరికి బట్టలు తీసుకుంటాడు సాగర్. అదే సమయంలో రామరాజు దగ్గరికి సేట్ వచ్చి డబ్బుల గురించి, అసలు వడ్డీ గురించి చెప్పి ఇవ్వమని చెప్తాడు. ఆ కోపంతో రామరాజు బైక్ పై ఇంటికి వస్తుంటాడు. ఇక మరోవైపు చందుకి శ్రీవల్లి కాల్ చేస్తుంది. ఎన్నోసార్లు చేసినా చందు కాల్ కట్ చేస్తాడు. దాంతో వల్లి వాయిస్ మెసెజ్ పెడుతుంది. అది చూసి ఫోన్ స్విచ్చాఫ్ చేస్తాడు చందు. ఇక అది చూసి వల్లి ఎమోషనల్ అవుతుంది. నేను చేసిన తప్పులకి.. నా కాపురం కూలిపోయిందంటూ వల్లి ఏడుస్తుంది. ఇక ప్రేమ ఒక దగ్గర నిల్చొని ఏడుస్తుంటే ధీరజ్ తన దగ్గరకి వెళ్ళి హగ్ చేసుకొని ఏడుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే
![]() |
![]() |